Dec 05,2021 19:18

శిశువు ఎదుగుదలకు తల్లి పాలు చాలా అవసరం. ఈ సమయంలో సరైన పోషకాహారం లేకపోతే బిడ్డకు సరిపడ పాలు తల్లి దగ్గర ఉండవు. అందుకే ఆహారంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు... తల్లికి అవసరమైన పోషకాహారం కూడా అందాలి.
* స్తన్యమిచ్చే కాలంలో తల్లికి నాణ్యమైన ప్రోటీన్‌ అవసరం. శరీరానికి కాల్షియం, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ డి, జింక్‌ వంటి విటమిన్లు ఉండే అన్ని రకాల కూరలు పెట్టాలి. రోజుకు 3-4 సార్లు భోజనం తినాలి.
* రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు, నెయ్యి, నూనె, చక్కెర, బెల్లం, సుగంధ ద్రవ్యాలు ఉండాలి. ఆకు కూరలు, నల్ల నువ్వులు, ఎండుద్రాక్ష, బెల్లం ఆహారంలో చేర్చుకోవాలి.
* పాలు, పాల ఉత్పత్తులు పెరుగు, పన్నీర్‌ రూపంలో రోజూ తీసుకోవాలి. కనీసం ఒక లీటరు పాలు తాగాలి. తెల్ల నువ్వుల గింజలు, రాగి లడ్డులను తినాలి.
* కాల్షియం, ఐరన్‌ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్‌, బీట్‌రూట్‌, చిక్కుళ్లు తినాలి. సి విటమిన్లు లభించే తాజా పండ్లు కమల, దానిమ్మ, యాపిల్‌ తీసుకోవాలి. జామ, బజ్రా వంటి కాల్షియం అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
* పప్పు పదార్థాలు, గుడ్లు, చేప తినొచ్చు.
* ప్రతిరోజూ ఎనిమిది కప్పుల నీరు, రసం తప్పనిసరి.