Jun 09,2021 08:32

పిల్లలూ !
భారతదేశం సాంస్క ృతిక వారసత్వానికి ప్రసిద్ధి అని అందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ మ్యూజియాల్లోని పురాతన వస్తువులు, కళాఖండాలు, అపూరూప చిత్రాలు దేశ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తాయి.
అయితే భారతదేశంలో కళలు, యుద్ధ పరికరాలు, పాత వస్తువులకు సంబంధించిన మ్యూజియమ్స్‌ గురించి తెలుసు కానీ ఓ పాకశాస్త్రం (కలినరీ)కి సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. దానికి ఇప్పుడు 'లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో చోటు దక్కించుకుంది. ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా 2018లో మణిపాల్‌లో భారతదేశపు తొలి కలినరి ఆర్ట్‌ మ్యూజియాన్ని స్థాపించారు. ఇది స్వాగత్‌ గ్రూప్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కాలేజ్‌లో ఉంటుంది. ఈ మ్యూజియాన్ని వారి తండ్రికి అంకితమిస్తూ దీన్ని ప్రారంభించారు. దేశంలో నలుమూలల నుంచి సేకరించిన టూల్స్‌, పాత్రలను సేకరించడానికి ఆయనకి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. దేశంలో పోర్చుగీసువారు తయారుచేసిన ప్లేట్లు, హరప్పన్‌ కాలం నాటి గిన్నెలు, 700 సంవత్సరాల పురాతన ఇనుప పాత్రలు, పురాతన వంట సామాగ్రి ఇలా 100 రకాల వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అంతేకాకుండా రకరకాల వంటలను కూడా చేసి పెడుతుంటారు.
మానవ సంస్క ృతి, చరిత్రలను పరిరక్షించే జ్ఞానభాండాగారాలైన మ్యూజియమ్స్‌ చారిత్రక పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలకు అప్పటికాంలో వంటకు వాడిన పాత్రలను చూపించాలంటే ఈ మ్యూజియానికి తీసుకెళ్లి చరిత్ర గురించి వివరిస్తూ పాఠాలు బోధించవొచ్చు.