Oct 27,2021 22:05

ఫొటో : అవగాహన కల్పిస్తున్న పిడి తిరుపతయ్య

ఫొటో : అవగాహన కల్పిస్తున్న పిడి తిరుపతయ్య
ఓటు హక్కుపై అవగాహన
ప్రజాశక్తి-వింజమూరు : పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో లో ఉదయగిరి ఎలక్ట్రోరల్‌ రిజిస్టర్‌ డ్వామా పీడీ తిరుపతయ్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సంవత్సరం వరకు 21 సంవత్సరంలకి ఓటు హక్కు ఉండేదని తరువాత 18 సంవత్సరాల కే ఓటు హక్కు ప్రభుత్వం వారు కల్పించారని దీని ద్వారా మంచి నాయకుల ఎన్నుకోవడం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే తీర్చిదిద్దుకోవడం సమాజంలో గొప్పగా బతికే అవకాశం ఉందన్నారు. ఆయనతోపాటు వింజమూరు తహశీల్దార్‌ సుధాకర్‌ రావు, జెడ్‌పిటిసి గణపురం బాలకష్ణ రెడ్డి, ఎంపీటీసీ రమణయ్య, ఉపాధ్యాయుడు జయంత్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.