Nov 30,2020 21:29

కలెక్టర్‌ గంధం చంద్రుడు

   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : ప్రత్యేక ఓటరుగా నమోదు కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌ 15వ తేదీలోగా కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గంధం చంద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం ఆఫ్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోదలచిన వారు ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, బూత్‌ లెవెల్‌ ఆఫీసర్ల వద్ద దరఖాస్తులు పొందాలన్నారు. ఈ దరఖాస్తులను షషష.వషఱ.అఱష.ఱఅ వెబెసైట్‌ నుంచి కూడా డౌన్లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పూరించిన దరఖాస్తులను ఓటరు నమోదు కేంద్రంలో ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోదలచిన వారు నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ షషష.అఙరజూ.ఱఅ లో వివరాలు నమోదు చేయాలన్నారు. కొత్త ఓటరుతో నమోదు పాటు మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. భారతీయ పాస్పోర్ట్‌ కలిగి విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ఫారం-6ఎ పూరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న పేరును తొలగించడానికి లేదా ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు తెలపడానికి ఫారం-7, ఓటర్ల జాబితాలో ఎంట్రీలలో మార్పులు లేదా దిద్దుబాట్ల కోసం ఫారం-8, శాసనసభ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు, బదిలీ కోసం ఫారం-8ఎను ఉపయోగించాలని తెలిపారు. ఓటరు నమోదు చేసుకునే ప్రక్రియ గురించి ఏదైనా సమాచారం కోసం 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్‌ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్‌ తెలియజేశారు.