
భోగాపురం(విజయనగరం): స్థానిక ఎన్నికల అధికారులు సక్రమంగా స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన వారు కూడా ఓటు వేసే అవకాశం లేక తిరుగుముఖం పట్టారు. సచివాలయ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు తమకు ఓటర్ స్లిప్పులు అందించకపోవడం దారుణమని వారు వాపోయారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా గందరగోళానికి గురయ్యారు.