Mar 02,2021 23:05

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ మౌర్య

నర్సీపట్నం టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్‌ శాతం పెంచాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. మంగళవారం నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్‌ పార్టీలు, పోటీలో నిలబడే అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ నాయకులు, ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఎక్కడ కోడ్‌ ఉల్లంఘన జరిగినా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.