Apr 14,2021 21:14

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లందరికీ తొలిదఫా కరోనా వ్యాక్సిన్‌ను త్వరలో చేయనున్నట్లు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓసి) తెలిపింది. ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా బుధవారం పర్చ్యువల్‌ సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదఫా వ్యాక్సిన్‌ను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లందరికీ చేయనున్నామన్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు 100రోజుల కౌంట్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో.. యూనియన్‌ హెల్త్‌ మినిస్ట్రర్‌ డా. హర్షవర్ధన్‌కు ఫిబ్రవరిలోనే లేఖ పంపామని.. అథ్లెట్లకు తొలిదఫా కరోనా వ్యాక్సిన్‌ చేయాల్సిందిగా కోరామని, తేదీలు ఇప్పటికీ ఖాయం కాలేదని, ఈ నెలలోనే వ్యాక్సిన్‌ను దేశంలోని అన్ని సారు కేంద్రాలకు పంపనున్నామన్నారు. కానీ ఏ రోజునుంచి అందుబాటులో ఉండేది మాత్రం స్పష్టం చేయలేదు.