Oct 26,2021 20:24

కరోనా కారణంగా షూటింగ్‌ జాప్యం జరగడంతో ... నిఖిల్‌ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పై వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాకు ముందు నిఖిల్‌ 'కార్తికేయ -2' సినిమా షూటింగ్‌ ఆరంభించాడు. టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ 2, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో '18 పేజెస్‌' మూవీకి కమిట్‌ అయ్యాడు. అనుపమా పరమేశ్వరన్‌ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో బన్నీ వాసు, సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌ ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌. దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ స్పై మూవీలోనూ నిఖిల్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల మొదటివారంలో మొదలైంది. ఇందులో నిఖిల్‌ సరసన ఐశ్వర్య మీనన్‌ నటిస్తోంది. నిఖిల్‌ నాలుగో సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ 25న మొదలైంది. ఈ సినిమాను సీనియర్‌ నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌కు ఇంకా పేరు పెట్టలేదు. ఇలా ఒకేసారి నాలుగు సినిమాల్లో చేస్తుండటం తన కెరీర్‌లో మొదటిసారి అని నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. ఈ నాలుగు సినిమాలకూ తన వంతుగా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు.