
పి.గన్నవరం (తూర్పుగోదావరి ): నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసి గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ను కౌలురైతులు సోమవారం ముట్టడించారు. జిసిఎస్ ప్రహరీని ఆనుకుని ఉండాల్సిన డ్రెయిన్ మూసుకుపోవడంతో సుమారుగా 5 వందల ఎకరాలు వరి పంట నీట మునిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని, నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.