మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మన్యం బంద్ ఉద్రిక్తం - భారీగా పోలీసులు మోహరింపు

08 ఆగస్టు, 2026

Tension during Manyam Bandh – Heavy police deployment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 02:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బస్సులు, ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న బంద్ నిర్వాహకులు


అమరావతి : రాష్ట్ర మన్యం బంద్ పిలుపుతో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ను విజయవంతం చేసేందుకు పలు ఆదివాసీ సంఘాల నాయకులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. పాడేరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బంద్ నిర్వాహకులు 3 రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జీవో రిజర్వేషన్కు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే జారీ చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బంద్ జరిగింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్