Nov 25,2020 21:17

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ టూర్‌లో ఉన్న వెస్టిండీస్‌ జట్టు టి20 సిరీస్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌ ఆటగాళ్లందరికీ జరిపిన కోవిడ్‌-19 మూడో పరీక్షల్లోనూ కెప్టెన్‌ పొలార్డ్‌ సహా ఆటగాళ్ళందరికీ నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇప్పటికే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న విండీస్‌ బృందం బుధవారం ఆక్లాండ్‌కు బయల్దేరి వెళ్లింది. ఈ వేదికపై న్యూజిలాండ్‌తో మూడు టి20ల సిరీస్‌ను విండీస్‌ జట్టు శుక్రవారం నుంచి ఆడనుంది. టి20 సిరీస్‌లో ఆడే చాలామంది విండీస్‌ ఆటగాళ్ళు యుఏఇలో ఐపిఎల్‌ ఆడి నేరుగా న్యూజిలాండ్‌కు చేరుకున్నారు.