Nov 30,2020 20:53

కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న టిటిడి ఇఒ జవహర్‌రెడ్డి

ఒంటిమిట్ట కరోనా వల్ల ఈ ఏడాది శ్రీకోదం డరామ స్వామి కల్యాణం జరపలేక పోయామని, చాలా బాధగా ఉందని, వచ్చే ఏడాది శ్రీరామనవమికి వైభవంగా నిర్వహి స్తామని టిటిడి ఇఒ కెఎస్‌.జవహర్‌రెడ్డి అన్నారు. సోమవారం రూ.17 కోట్లతో నిర్మించిన శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విప త్తుల కారణంగా మళ్లీ అలాంటివి జరగ కుండా ప్రజలకు అన్ని విధాలా సౌక ర్యంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొ న్నారు. స్వామివారి కల్యాణం బాగా జరిగేం దుకు మండపాన్ని నిర్మించామన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే కల్యాణోత్సవానికి ఇప్పటి నుంచే అధికారులు అన్ని విష యాలలో అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు .కార్యక్ర మంలో ఎస్‌సి జగదీ óశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఇఒ లోకనాథం, ఇఇ హర్షవర్ధన్‌ రడ్డి, జెఇ దేవరాజు పాల్గొన్నారు.
దేవాలయాల అభివద్ధికి సాయం
కమలాపురం టౌన్‌ : ఆలయాల అభివృద్ధికి సాయం చేస్తామనిమ టిటిడి ఇఒ జవహర్‌రెడ్డి అన్నారు. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భంగా టి.చదిపిర ాళ్ళలోని అగస్తేశ్వర స్వామిని దర్శించు కున్నారు. అనంతరం స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయనకు మంగళ వారు ుద్యాల మధ్య పూర్ణకుంభంతో వేదపం డితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివద్ధికి టిటిడి తరపున సాయం అందించేందుకు పరిశీలన బృందాన్ని ఇక్కడికి పంపిస్తామని పేర్కొ న్నారు. ఈ గ్రామానికి చెందిన ఆదాయపు పన్ను శాఖాధికారి నా మిత్రుడు జి.రవీంద్ర నాథ్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాన న్నారు. ఇక్కడున్న ఆలయాలు, వాటి చరిత్ర గురించి తనకు ఆయన వివరిం చారన్నారు. ఇక్కడి స్థలాన్ని, దేవాలయాల చరిత్రను పరి శీలించాక, బోర్డు దష్టికి తెస్తామన్నారు. తప్ప కుండా సహాయం అందిస్తామని చెప్పారు. శెట్టినాడు, అంజనీ సిమెంట్‌ పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ జనార్దన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త జయ రామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, టిడిపి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.