Mar 02,2021 23:08

మాట్లాడుతున్న డాక్టరు సోమేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : ఆరు నెలలకే ప్రసవించిన నవజాత శిశువుకి తలెత్తిన శ్వాస కోశ వ్యాధులతో పాటు ఇతరత్రా వ్యాధులకు కిమ్స్‌ వైద్యులు మెరుగైన చికిత్స అందించి శిశువుకు పునర్జన్మనిచ్చారు. ఈ మేరకు మంగళవారం కిమ్స్‌ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ గూడేన సోమేశ్వరరావు మాట్లాడారు. ఈ ఏడాది మార్చి నెలలో జన్మించాల్సిన శిశువు గత ఏడాది నవంబరు 21న 900 గ్రాములతో ఊపిరి పోసుకుందని వైద్యులు సోమేశ్వరరావు వివరించారు. ఆరు నెలలకే ప్రసవించిన శిశువు శ్వాసకోశ సమస్యలతో ఇతరేత్రా సమస్యలతో ఊపిరి పీల్చుకునేందుకు అవస్థలు పడుతుండడంతో శిశువు తల్లిదండ్రులు హేమలత, ఆదానారాయణలు కిమ్స్‌ ఆస్పత్రిని సంప్రదించారన్నారు. చిన్నారిని నాటి నుంచి 102 రోజుల పాటు ఆరోగ్యశ్రీ ద్వారా చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రామలింగేశ్వర్‌ పర్యవేక్షణలో మెరుగైన వైద్యచికిత్సను అందించామన్నారు. రేయింబవళ్లు ఎన్‌ఎసిఎల్‌లో శిశువును పర్యవేక్షించినట్టు తెలిపారు. ప్రస్తుతం శిశువు 1.7 కేజీల బరువుతో ఆరోగ్యవంతంగా ఉండడంతో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఇదే వైద్యం కోసం ఇతరత్రా ఆసుపత్రులకు వెలితే రూ.లక్షల్లో వైద్యఖర్చులు అయ్యేవని ఆయన తెలిపారు. కిమ్స్‌ ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యాన్ని నిరుపేదలకు సైతం అందిస్తూ ఉత్తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కివమ్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ సోమేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో కిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బమ్మిడి అప్పలనాయుడు, పిఆర్‌ఒ గోపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.