Oct 27,2021 22:27

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి

ప్రజాశక్తి- నంద్యాల క్రైమ్‌ : నంద్యాల మండలంలోని చాబోలు గ్రామంలో రూ. 40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని డిఎల్‌డిఒ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయంలో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచి కడియం మౌనిక,పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు షేక్‌ మదార్‌ షా తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : గ్రామాల్లో ఉన్న సచివాలయాలు సమస్యల పరిష్కారానికి నిలయాలుగా నిలుస్తాయని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని భూపనపాడు, కొత్తూరు, గగ్గుటూరు, ఆలమూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జగనన్న సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని, ఇందులో అన్ని రకాల సేవలు అందుబాటులో వుంటాయన్నారు. వాటిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల సర్పంచులు, వైసిపి నాయకులు రామలక్ష్మయ్య, సూర్యనారాయణ రెడ్డి, జెడ్‌పిటిసి సరళమ్మ, ఎంపిపి హుస్సేనబీ, ఎంపిడిఒ దస్తగిరి, తహశీల్దార్‌ రత్నరాధిక, ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి