Jan 10,2021 15:00

ఒంగోలు అర్బన్‌ (ఒంగోలు): ఆస్తిపన్ను వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని పాత ఆంధ్ర బ్యాంకు సెంటర్‌లో ఆస్తి విలువ ఆధారంగా పన్ను విదించే విధానం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇలా పన్నులు విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పన్నుల భారాన్ని మోపడం దారుణమన్నారు.