Nov 25,2021 20:30

ఎస్‌ ఆర్ట్స్‌ పతాకంపై జి.అరుళ్‌కుమార్‌ సమర్పణలో దినేష్‌ లక్ష్మణన్‌ దర్శకత్వంలో 'ప్రొడక్షన్‌ నంబరు-2' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో హీరో విశాల్‌ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఓ కీలక పాత్ర పోషించనున్నారు. నటుడు కదిర్‌ తండ్రి లోగు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్‌, ఐశ్వర్యా రాజేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో జీకే రెడ్డి కనిపించనున్నారు. జీకే రెడ్డి, లోగు పాత్రలు చిత్ర కథకు ఎంతో బలాన్ని ఇవ్వడంతో పాటు ప్రాముఖ్యత కలిగిన పాత్రలుగా నిలుస్తాయని, ఈ పాత్రలకు వీరిద్దరిని కూడా పలు దశల ఆడిషన్స్‌ తర్వాత ఎంపిక చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది.