Nov 29,2020 22:39

కాకినాడలో నండూరికి నివాళులు అర్పిస్తున్న నేతలు

ప్రజాశక్తి-కాకినాడ సిటీ, పెద్దాపురం : స్వాతంత్య్ర సమర యోధుడు, కార్మికోద్యమ నేత నండూరి ప్రసాదరావు 19వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘం అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబీ రాణి, సీనియర్‌ నేత దువ్వా శేషబాబ్జి నండూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట యోధునిగానే కాక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధునిగా కూడా నండూరి చరిత్రలో నిలిచారని కొనియా డారు. రైతు సంఘం అఖిల భారత నాయకునిగా ఉన్న నండూరి ఎపిలో సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కార్మికులు సంఘటితమయ్యేలా కషి చేశారని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా ప్రజావాణి వినిపిం చారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, మేడిశెట్టి వెంకట రమణ, నాగేశ్వరరావు, పలివెల వీరబాబు పాల్గొన్నారు. పెద్దాపురంలోని సూర్యారావు భవనంలో జరిగిన నండూరి ప్రసాదరావుకు ఘన నివాళి అర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.వీర లక్ష్మి మాట్లాడారు. నండూరి సారథ్యంలో కార్మిక ఉద్యమాన్ని బలోపేతంగా నిర్మించారన్నారు. రైతాంగ అఖిలభారత నాయకునిగా రైతాంగ ఉద్యమానికి కషి చేశారన్నారు. వ్యవసాయ కూలీల హక్కుల సాధన, ఆర్థిక, సామాజిక అభివద్ధికి ఎంతో శ్రమించారన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో సిరపరపు శ్రీనివాస్‌, కేదారి నాగు, సిపిఎం నాయకులు కె.అరుణ డి.సత్యనారాయణ, గడిగట్ల సత్తిబాబు, ఆర్‌.వీర్రాజు, ఎం.నాగు, డి.కష్ణ, క్రాంతి కుమార్‌, బేబి పాల్గొన్నారు.