
ప్రజాశక్తి - మదనపల్లి రూరల్ : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిధున్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం మదనపల్లి మండలం, బొమ్మన చెరువు పంచాయతీ, మందబండ గ్రామం వద్ద నివర్ తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నివర్ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించేందుకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలధికారుల తిరుపతిలో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయం పంటలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ శాఖ ఏ డి.శివ శంఖర్, ఎంపిడి ఓ లీలామాదవి, తహశీల్దార్ కప్పుస్వామి, ఏఓ నాగ ప్రసాద్, ఉద్యాన వన శాఖ హెచ్ ఓ.ఉమాదేవి, సింగిల్ విండో అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి,వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.