Oct 28,2021 15:58

ప్రజాశక్తి- తుళ్లూరు
నిత్యావసర వస్తువులైన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ తుళ్లూరులో సిపిఎం, సీపీఐలు గుఉరువారం ధర్నా నిర్వహించారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం రవి, సిపిఐ రాజధాని ఏరియా కార్యదర్శి జీవి రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గ్రంథాలయం సెంటర్‌లో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. కార్పొరేట్‌ ల ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తూ ప్రజాకంటక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పేరం బాబురావు, జె నవీన్‌ ప్రకాష్‌, షేక్‌ జానీ, బెజ్జం గరటయ్య సీపీఐ నాయకులు కె ఈశ్వరయ్య, స్వామి పాల్గొన్నారు.