Feb 25,2021 19:20

మాట్లాడుతున్న లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌

నిత్యావసర వస్తువులు అందజేత
ప్రజాశక్తి - చిల్లకూరు :విపత్తు సమయాల్లో లయన్స్‌ క్లబ్‌ ప్రజలకు అండగా ఉంటుందని లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ సి రమేష్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిల్లకూరు మండలం, తిప్పగుంటపాలెంలో ఇటీవల నివర్‌ తుపాన్‌తో నష్టపోయిన మత్య్సకారుల కుటుంబాలకు లయన్స్‌ క్లబ్‌, వైజెపి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు రూపేష్‌ కుమార్‌రెడ్డి, నవీన్‌, జయకుమార్‌ అధ్యక్షతన కిట్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ రమేష్‌ నాథ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రపంచంలో ఏ మూలన విపత్తులు సంభవించినా స్పందించి ఆదుకుంటుందన్నారు. అందులో భాగంగానే నివర్‌ తుపాన్‌ బాధితుల కోసం లయన్స్‌ ఇంటర్నేషనల్‌ రూ 7.5 లక్షల మంజూరు చేసిందన్నారు. ఆ నిధులలో కొంతభాగం మండలంలోని తిప్ప గుంట పాలెం, చేడిమాల, పారిచర్లవారి పాలెం గ్రామాల్లోని మత్య్సకారులకు 600 కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సీనియర్‌ లయన్‌ ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ సేవలు ఆభినందనీ యమన్నారు. లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌ షేక్‌. రియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి లో సభ్యత్వం కలిగిన ఏకైక సంస్థ లయన్స్‌ క్లబ్‌ అని తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌ ఆర్‌విరావ్‌, మల్లెమాల మురళీమోహన్‌ రెడ్డి, వాకాటి రామమోహన్‌రావు, రజనీకాంత్‌ రెడ్డి, షేక్‌ మస్తాన్‌, మధనమేటి రమణయ్య, మురళీనాయుడు, సుధాకర్‌, వేణురెడ్డి, మంజులాదేవి, సాధిక్‌ బాష, మురళీ, సర్పంచి సుకన్య, వెంకటేశ్వర్లు, రాఘవ రెడ్డి ఉన్నారు.