Nov 30,2020 22:03

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
ప్రజాశక్తి- తిరుమల:
ప్రమాదవశాత్తు ఓ చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన సోమవారం తిరుమలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుమలలోని బాలాజీ నగర్‌లోని 689నెంబర్‌ గల ఇంటిలో భానుప్రకాష్‌, జయంతి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం ఉదయం పెద్ద కుమార్తె శశికళ (6) ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టిలో జారిపడిపోయింది. కొంత సమయం తర్వాత పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టపక్కల వెతికారు. చివరికి నీటితొట్టిలో శశికళను గుర్తించి స్థానికి అశ్విని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.