Oct 27,2021 20:36

మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసిన జాతీయ సెలెక్షన్‌ కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ సెలెక్షన్‌ కమిటీ ఖేల్‌రత్న అవార్డుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు 11మంది ఆటగాళ్లను సిఫార్సు చేసింది. ఈ ఏడాదికిగాను ఉత్తమ ఆటగాళ్లకు అందజేసే అవార్డుకు ఖేల్‌రత్నతోపాటు అర్జున అవార్డుకు మరో 35మంది ఆటగాళ్లను సెలెక్షన్‌ కమిటీ ప్రతిపాదించింది. అత్యున్నత పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాతోపాటు, సీనియర్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌, భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ ఉన్నారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో సత్తా చాటిన ఐదుగురు అథ్లెట్లను, రవి దహియ, పిఆర్‌ శ్రీజేశ్‌, లౌల్లీనా బోర్గోహైన్‌లకు ఎంపిక చేసింది. అర్జునకు సిఫార్సు 35మంది ఆటగాళ్లలో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ చోటు దక్కించుకున్నాడు.
ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు..
నీరజ్‌ చోప్రా(అథ్లెటిక్స్‌)
రవి దహియ(రెజ్లింగ్‌)
పిఆర్‌ శ్రీజేశ్‌(హాకీ)
లౌల్లీనా బోర్గోహైన్‌(బాక్సింగ్‌)
సునీల్‌ ఛెత్రీ(ఫుట్‌బాల్‌)
మిథాలీ రాజ్‌(క్రికెట్‌)
ప్రమోద్‌ భగత్‌(పారా బ్యాడ్మింటన్‌)
కృష్ణ నగర్‌(పారా బ్యాడ్మింటన్‌)
సుమిత్‌ అంతిల్‌(పారా జావెలిన్‌త్రో)
అవని లేఖరా(పారా షూటింగ్‌)
ఎం నర్వాల్‌(పారా షూటింగ్‌)