Jan 18,2021 18:54

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు సరైన నిద్ర కూడా పోవాలి. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దానివల్ల మెదడు పనితీరు, జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రముఖ వైద్యులు అంటున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- శరీరంలోని మలినాలు బయటకు పోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడు జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మెదడు బాగా అలిసిపోయి నిద్ర త్వరగా పడుతుంది.
- మెదడుపై ఒత్తిడి పెంచే మానసిక ఆలోచనలు తగ్గించాలి.
- శరీరంలో మెగ్నీషియం తగ్గినప్పుడు త్వరగా నిద్రపట్టదు. రాత్రి పడుకునే ముందు గుప్పెడు మెగ్నీషియం స్ఫటికలు గోరు వెచ్చని నీటిలో వేసి కాళ్లను అరగంట పాటు ఉంచాలి. అప్పుడు త్వరగా నిద్రపడుతుంది.
- రాత్రి భోజనం 8 గంటల లోపు త్వరగా జీర్ణం అయ్యే తక్కువ మోతాదులో ఆహారాన్ని తినాలి.
- సి విటమిన్‌ అధికంగా ఉండే అరటికాయ, నల్ల ద్రాక్ష, కమలా పండ్లను తినాలి.
- రోజుకు ఐదు లీటర్ల మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. గోరువెచ్చని మంచినీళ్లు తాగితే ఇంకా మంచిది.
- రాత్రి వేళలో టీ, కాఫీలు తీసుకోకూడదు. ప్రతి రోజూ గ్లాసు పాలు తాగాలి.
- పడుకునేముందు పుస్తకం చదవడం, మంచి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రపడుతుంది.