
విశాఖ : విశాఖ జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు.. గత మూడు రోజుల నుండి అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో సుమారు 180 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయగా వాటిలో నిబంధనలు పాటించని 100 వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించనివి, ప్రయాణికుల లగేజిని కాకుండా ఇతర లగేజిని బస్సులో కలిగిఉండటం, ప్రయాణికుల జాబితాలో తప్పుల తడకగా ఉండటం, సరిగ్గా టాక్స్ చెల్లించకపోవడం వంటి వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు.