
గుంటూరు రైల్వే: ఈ నెల 26 నుంచి గుంటూరు - సికింద్రాబాద్-గుంటూరు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి నరేంద్రవర్మ తెలిపారు. ఈ రైలు(02705) గుంటూరులో 15.00 గంటలకు ప్రారంభమై, మంగళగిరి 15.20, విజయవాడ 15.36, సికింద్రాబాద్ 21.50 గంటలకు చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు(నెం.02706) సికింద్రాబాద్లో 07.45 గంటలకు బయలుదేరి విజయవాడ 13.10, మంగళగిరి 13.33, గుంటూరు 14.25 గంటలకు చేరతుందని తెలిపారు. అలాగే ఈ నెల 27 నుండి గుంటూరు-రాయగఢ-గుంటూరు మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. ఈ రైలు(07243) గుంటూరులో 23.20 గంటలకు బయలుదేరి మంగళగిరి 23.40, విజయవాడ 23.55, విశాఖపట్టణం 08.45, రాయగఢ 13.40 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు(నెం.07244) ఈనెల 28న రాయగఢలో 14.50 గంటలకు ప్రారంభమై విశాఖపట్టణం 19.15, విజయవాడ 02.35, మంగళగిరి 03.10, గుంటూరు 04.15 గంటలకు వస్తుందని పేర్కొన్నారు.