Dec 04,2021 07:39

ప్రజాశక్తి-తిరుమల : భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన అప్‌ ఘాట్‌ రోడ్డు, రక్షణ గోడల పునర్నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్‌ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్‌ అధికారులతో చైర్మన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రమాదకరం గా ఉన్న కొండ చరియలను గుర్తించి కెమికల్‌ టెక్నాలజీతో తొలగించేందుకు చర్యలు తీసుకో వాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌, అదనపు ఇఒ ధర్మారెడ్డి, ఢిల్లీ ఐఐటి నిపుణులు కె.వి. రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.