Jun 11,2021 09:25

మాడ్రిడ్‌ : యుఇఎఫ్‌ఏ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రా రంభం కానున్నాయి. టర్కీ- ఇటలీ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. టైటిల్‌కై తలపడే 24జట్లను 6 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగేసి జట్ల చొప్పున మిగతా మూడు జట్లతో ఒక్కోసారి తలపడనున్నాయి. లీగ్‌ అనంతరం ప్రతి గ్రూప్‌ లో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపి యన్‌గా పోర్చుగల్‌ బరిలోకి దిగనుంది.
గ్రూప్‌ ఏ: ఇటలీ, స్విట్జర్లాండ్‌, టర్కీ, వేల్స్‌
గ్రూప్‌ బి: బెల్జియం, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, రష్యా
గ్రూప్‌ సి: ఆస్ట్రియ, నెదర్లాండ్స్‌, నార్త్‌ మెసిడో, ఉక్రెయిన్‌
గ్రూప్‌ డి: క్రొయేషియ, చెక్‌ రిపబ్లిక్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌
గ్రూప్‌ ఇ: పోలండ్‌, స్లొవేకియ, స్పెయిన్‌, స్వీడన్‌
గ్రూప్‌ ఎఫ్‌: ఫ్రాన్స్‌, జర్మనీ, హంగరీ, పోర్చుగల్‌