
ప్రజాశక్తి - పలాస: జీడి కార్మికుల పొట్ట కొట్టే భారీ యంత్ర పరిశ్రమను వ్యతిరేకిస్తూ పలాస ఆర్టీసీ డిపో ఎదురుగా మంగళవారం అన్ని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో కలిసి రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు క్యాష్యూ లేబరు, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ గౌరవాధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి, అధ్యక్షులు బొంపల్లి సింహాచలం, కార్యదర్శి బొమ్మాళి తాతయ్యలు తెలిపారు. సోమవారం కార్మిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పలాస-కాశీబుగ్గ పారిశ్రామికవాడలో భారీ యంత్రాలతో జీడి పరిశ్రమ ఏర్పాటుతో కార్మికుల తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని మూడు నెలలుగా ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో దీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జీడి పరిశ్రమల్లో పనులను బంద్ చేసి, కార్మికులతో భారీగా ర్యాలీగా వెళ్లి, ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు.