
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ సమావేశాల్లో 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ, ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల మఅతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎపి అసెంబ్లీ సంతాపం తెలపనుంది.