May 18,2021 22:51

నేమకల్లులో ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది

ప్రజాశక్తి - చిప్పగిరి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని నేమకల్లు గ్రామంలో విఆర్‌ఒ రాముడు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, వాలంటీర్లు మంగళవారం ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనాను నివారణకు ముందస్తు ప్రణాళికగా ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారా తదితర వివరాలు నమోదు చేసుకుంటున్నామన్నారు. ఇంటి పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆశా కార్యకర్తలు ఈరమ్మ, వాలంటీరు లావణ్య, గ్రామ సేవకులు పాల్గొన్నారు.