Jan 21,2021 21:24

నారాలోకేష్‌ను కలిసిన టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాంచినబాబు



ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్‌ను టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాంచినబాబు, రాజంపేట పార్లమెంటరీ టిడిపి ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో ఇంతటి పదవులను అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టిడిపికి కంచుకోటగా ఉన్న మదనపల్లెను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని, అందరినీ కలుపుకొని పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడాలని, అన్ని వింగ్‌లలోనూ శాఖలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.