Jan 15,2022 16:30

ఢిల్లీ: తన హత్యకు కుట్ర జరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలిపారు. కొందరికి జబ్బు చేస్తుంది.. కానీ తమ సీఎం జగన్‌కు డబ్బు చేసిందని ఆయన విమర్శించారు. ''నన్ను హత్య చేయడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రోద్భలంతో ఎపి సిఐడి చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ కుట్ర పన్నారు. నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేయించడానికి జార్ఖండ్‌కు చెందిన గూండాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సిఐడి చీఫ్‌తో పాటు సీఎం నుంచీ నాకు ప్రాణ హానీ ఉంది'' అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం ఈ అంశంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్‌ఐఏ) దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే.