Oct 18,2021 06:38

నువ్వెప్పుడు యీ ఆకుల మీదుగా
ప్రయాణించి వెళ్ళావో
స్పర్శ పొందిన యీ వృక్షాలు చెప్పలేదు
నదిమీద తేలుతున్న ఎండ నీడను
బంధించి దాచాను
ఇద్దరమూ రెండు ఆకాశాలై ఎగురుదాం
ఒకవేళ మేఘం..
నీవైపుగా వస్తే యిలా చెప్పు
దోసిళ్లలో కొన్ని పూలున్నాయి
పరిమళ్ళాల్ని నాకు చేర్చమని
తారలూ, నువ్వూ చెరిగిపోరు
మిమ్మల్ని చేరుకోటానికి
ఎన్నిసార్లైనా పుడతాను !
- గుబ్బల శ్రీనివాస్‌
89066 97777