Oct 12,2020 21:16
నాదల్‌పై ఫెదరర్‌ ప్రశంసల జల్లు

మిలాన్‌(స్విట్జర్లాండ్‌): ఫ్రెంచ్‌ ఓపెన్‌ను రికార్డుస్థాయిలో 13వ సారి గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు రికార్డును రఫెల్‌ నాదల్‌ను ఫెదరర్‌ ప్రశంసతో ముంచెత్తాడు. ట్విట్టర్‌ వేదికగా ఫెదరర్‌ సోమవారం స్పందిస్తూ.. 'స్నేహితుడు రఫాను ఎప్పుడూ గౌరవిస్తానని, ఓ వ్యక్తిగా ఒక ఛాంపియన్‌గా అతన్ని గుర్తిస్తానని, చాలా ఏళ్ల నుంచి నాకు సరైన ప్రత్యర్థి అతనే అని, ఇన్నాళ్లూ ఇద్దరం పోటీపడడం వల్లే తాము ఉత్తమ ఆటగాళ్లుగా రాణించగలిగామని' ఫెదరర్‌ తెలిపాడు. అలాగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను అత్యధికంగా 13 సార్లు గెల్చిన నాదల్‌ రికార్డును ఇప్పట్లో ఎవరూ బ్రేక్‌ చేయలేరని, ఎర్రమట్టి కోర్టులో 100 మ్యాచ్‌లు గెలుపు ఘనతను ఎవరూ ఒంటరిగా సాధించలేరని, టీమ్‌ సభ్యులకు కూడా కంగ్రాట్స్‌ చెబుతున్నట్లు ఫెదరర్‌ తెలిపాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు తమ ఇద్దరి జర్నీలో భాగమని, అన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను గెలవడానికి నాదల్‌ అర్హుడని మెచ్చుకున్నాడు. జకోవిచ్‌ 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌కు ఫెదరర్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు మోకాళ్లకు సర్జరీ చేయించుకున్న ఫెదరర్‌ వచ్చే ఏడాది మళ్లీ రాకెట్‌ పట్టనున్నట్లు తెలిపాడు.