Oct 27,2021 23:46

ఆర్థిక సాయం అందజేస్తున్న ఎస్‌పి , తదితరులు

ప్రజాశక్తి - కర్నూలు క్రైం: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర హోంశాఖామాత్యులు ఎం.సుచరిత, డిజిపి డి.గౌతంసవాంగ్‌ అసువులుబాసిన పోలీస్‌ అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు మేన్‌ కైండ్‌ ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో అర్థిక వితరణను చేసే కార్యక్రమాన్ని బుధవారం అన్ని జిల్లాల యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్‌పి సిహెచ్‌. సుధీర్‌ కుమార్‌ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మ్యాన్‌ కైండ్‌ ఫార్మసీ సంస్ధ ఇచ్చిన ఆర్దిక సాయంగా అందజేసిన చెక్కులను మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్‌పి అందజేశారు. ఇందులో నాగేశ్వరమ్మ కర్నూలు హోంగార్డు యూనిట్‌ లో విధులు నిర్వహిస్తూ కరోనా తో మృతి చెందారు. రూ. 3 లక్షల చెక్కును ఆమె కుమార్తె కె. శిరీషకి అందజేశారు. రమిజుల్లాబేగ్‌ కర్నూలు హోంగార్డు యూనిట్‌ లో విధులు నిర్వహిస్తూ కరోనా తో మృతి చెందారు. రూ. 3 లక్షల చెక్కును ఆయన భార్య షేక్‌ ఫరీదా బేగంకు అందజేశారు. మ్యాన్‌ కైండ్‌ ఫార్మా సంస్థ వారికి జిల్లా ఎస్‌పి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు తాము అండగా ఉంటామని జిల్లా ఎస్‌పి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీతో పాటు హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌ , డిఎస్‌పిలు రమణ, రవీంద్రారెడ్డి, ఎఒ సురేష్‌ బాబు, మ్యాన్‌ కైండ్‌ ఫార్మాసి ఇంచార్జ్‌ పూర్ణచందర్‌, హోంగార్డు సంఘం అధ్యక్షులు విజయరత్నం ఉన్నారు.