Dec 03,2021 21:04

- భారత్‌ 221/4
-అజాజ్‌ పటేల్‌కు నాలుగు వికెట్లు
-వెలుతురు లేమితో ముందే నిలిచిన ఆట

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీతో మెరిశాడు. దీంతో మయాంక్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్‌ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్‌ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

ముంబయి: ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారతజట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(126నాటౌట్‌) అజేయ శతకంతో మెరిసాడు. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌, మయాంక్‌ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జతచేశారు. గిల్‌ అవుటైన తర్వాత భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో పుజారా(0), కోహ్లీ(0) డకౌట్‌ అయ్యారు. కోహ్లీ అవుట్‌ వివాదాస్పదం అయినప్పటికీ భారత జట్టుకు మాత్రం ఇది గట్టి షాకిచ్చింది. దీంతో భారత్‌ 80 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్‌ అయ్యర్‌(18) తోడుగా మయాంక్‌ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 160 పరుగుల వద్ద అయ్యర్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాహా.. మయాంక్‌కు అండగా నిలిచాడు. వీళ్లిద్దరూ సంయమనంతో ఆడారు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత మయాంక్‌ శతక్కొట్టాడు. సాహా కూడా చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. చివరి సెషన్‌లో వెలుతురి లేమి కారణంగా ఇన్నింగ్స్‌ను 70 ఓవర్లకే ముగించారు. తొలిరోజు మ్యాచ్‌ నిలిచే సమయానికి భారత జట్టు 4వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజ్‌లో మయాంక్‌(120), సాహా(25) ఉండగా.. భారత్‌ కోల్పోయిన నాలుగు వికెట్లూ అజాజ్‌ పటేల్‌ తీసాడు.
స్కోర్‌బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌(బ్యాటింగ్‌) 120, శుభ్‌మన్‌ (సి)రాస్‌ టేలర్‌ (బి)అజాజ్‌ పటేల్‌ 44, పుజారా (బి)అజాజ్‌ పటేల్‌ 0, కోహ్లి (ఎల్‌బి) అజాజ్‌ పటేల్‌ 0, శ్రేయస్‌ (సి)బ్లండెల్‌ (బి)అజాజ్‌ పటేల్‌ 18, వృద్ధిమాన్‌ సాహా (బ్యాటింగ్‌) 25, అదనం 14. (70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 221 పరుగులు.
వికెట్ల పతనం: 1/80, 2/80, 3/80, 4/160
బౌలింగ్‌: సౌథీ 15-5-29-0, జేమీసన్‌ 9-2-30-0, అజాజ్‌ పటేల్‌ 29-10-73-4, సోమర్విల్లా 8-0-46-0, రచిన్‌ రవీంద్ర 4-0-20-0