Nov 30,2020 22:25

ముత్యాల ప్రసాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పిస్తున్న నాయకులు

సంతాప సభలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నేతలు
ప్రజాశక్తి - కర్నూల్‌ కలెక్టరేట్‌:
 నిబద్దతకు, విలువలకు, కలానికే వన్నె తెచ్చిన వ్యక్తి ముత్యాల ప్రసాద్‌ అని, అయన మృతి పత్రికా రంగానికి తీరనిలోటని పలువురు వక్తలు అన్నారు. ఎపిడబ్ల్యూజెఫ్‌, ఏపిబిజెఎ జిల్లా శాఖల ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని రెవిన్యూ పొదుపు భవన్‌లో ముత్యాల ప్రసాద్‌ సంతాపసభ నిర్వహించారు. ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు కెబి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఎపిడబ్ల్యూజెఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి. మద్దిలేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోరంట్లప్ప విశాలాంధ్ర కర్నూలు ఎడిషన్‌ మేనేజర్‌ కె.నాగరాజు, ఎపిబిజెఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జి ప్రసాద్‌, సాహితీ స్రవంతి కన్వీనర్‌ కెంగార మోహన్‌, మనం పత్రిక బ్యూరో సీనియర్‌ జర్నలిస్ట్‌ నాగరాజులు మాట్లాడారు. కరోనాతో ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, కరోనా పరిస్థితుల్లో వర్కింగ్‌ జర్నలిస్టులను ఫ్రెంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ పథకం వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్‌ మౌలాలి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బి.చిన్న రామాంజనేయులు, నగర అధ్యక్షులు కె.మధుసూదన్‌, జిల్లా కమిటీ సభ్యులు డి.చంద్రమోహన్‌, యూసఫ్‌ ఖాన్‌, నగర ఉపాధ్యక్షులు మధు, శివ, చెన్నయ్య, నాయకులు అంజి, శ్రీరాములు పాల్గొన్నారు.