
భీమవరం రూరల్:స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్‌ను సంస్థ రీజినల్ మేనేజర్ కె.శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణగుప్తా, సెక్రటరీ కాగిగ వెంకట రమణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఆర్థిక అవసరాల నిమిత్తం బంగారంపై రుణాలు అందిస్తున్నామని, వినియోగదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.