Feb 25,2021 21:57

ఫొటో : జాయింట్‌ కలెక్టర్‌కు సమస్యలు వివరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి

ఫొటో : జాయింట్‌ కలెక్టర్‌కు సమస్యలు వివరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి
ముసునూరు లేఅవుట్‌కు రోడ్డు వేయించాలి
- ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
ప్రజాశక్తి - కావలి : జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ''పేదలందరికీ ఇళ్లు'' పథకం కింద పట్టణంలోని ముసునూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌కి వెళ్లేందుకు జాతీయరహదారి నుంచి రోడ్డు వేయడానికి అవసరమైన భూమిని సేకరించి, రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జెసి హరింద్రప్రసాద్‌ను కోరారు. గురువారం ఆయన జెసిని నెల్లూరులోని ఆయన ఛాంబర్‌లో కలిసి, నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో అల్లూరు మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ శంభునిపాలెం ప్రజలు 'శంభన్‌' కులానికి చెందినవారిని ఎస్‌.సి.కులంలో కలిపే వరకు ఎన్నికలను
బహిష్కరించి, నిరసన తెలిపిన విధానాన్ని గురించి జె.సి. దృష్టికి తీసుకెళ్లారు. వారికి సంబంధించి న్యాయస్థాన తీర్పు కూడా అనుకూలంగా వచ్చినందున వారి అభ్యర్థనను వినాలని జాయింట్‌కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలెక్టర్‌ చక్రధర్‌బాబును, రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభారకరరెడ్డిని కలిశారు. కావలి నియోజకవర్గ సమస్యలపై వారితో చర్చించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమాలలో వారివెంట కావలి వ్యవసాయవ ూర్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నాయకులు జనిగర్ల మహేంద్రయాదవ్‌, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.