Apr 14,2021 20:16

మురుగుదాస్‌ '1947' అనే పాన్‌ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఓం ప్రకాష్‌ భట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'విష్ణువర్ధన' 'యాజమాన్య' వంటి చిత్రాలు తీసిన దర్శకుడు పోన్‌ కుమారన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం '1947' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.