
- స్వాధీనం చేసుకొని పడేసిన పంచాయతీ అధికారులు
ప్రజాశక్తి - బనగానపల్లె: ఆకుకూరల వ్యాపారులు మురికి గుంతలో ఆకుకూరలను కడుగుతుండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి ఆకుకూరలను స్వాధీనం చేసుకుని పడేశారు. సోమవారం కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్మే వ్యాపారులు జుర్రేరు వాగులోని మురికి గుంతలో ఆకుకూరలను కడుగుతుండగా పట్టణ ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మురికి గుంతలో కడిగిన ఆకుకూరలను వ్యాపారులు మార్కెట్లో విక్రయిస్తుండగా పంచాయతీ ప్రత్యేకాధికారి శివరామయ్య, ఖలీల్, పంచాయతీ సిబ్బందితో వెళ్లి ఆకుకూరలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్లతో తరలించి పడేశారు. నాసిరకం కూరగాయలు, ఆకుకూరలు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.