
హైదరాబాద్: క్రికెటర్ సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోగానే ముందుగా ఇంటికి వెళ్లకుండా తండ్రి మహ్మద్‌గౌస్ సమాధిని సందర్శించారు. సిరాజ్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వెళ్లిన కొన్నిరోజులకే గౌస్ మరణించిన విషయం విధితమే. టీమిండియా క్రికెటర్‌గా తన కొడుకును చూసుకోవడానికి ఆయన తీవ్ర కృషి చేశారు. తండ్రి మరణించిన వార్త తెలియగానే సిరాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లాడు. అంత్యక్రియలకు వెళ్లడానికి బిసిసిఐ అనుమతించినా, తన తండ్రి కలను నెరవేర్చడానికిగానూ ఆయన ఆస్ట్రేలియాలోనే ఉండిపోయారు. అలాగే గబ్బాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.