Apr 08,2021 18:00

అమరావతి: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు 47.42శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపిటిసి, 515 జడ్పిటిసి స్థానాలకు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటలకు క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే.. ఫలితాల ప్రకటపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల తర్వాత ఓట్ల లెక్కింపుపై స్పష్టత వస్తుంది.