Nov 25,2021 21:05

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌
హోస్టన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ మూడోరౌండ్‌లోకి భారత స్టార్‌ ప్లేయఱ్‌ జి. సాథియాన్‌ ప్రవేశించాడు. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో సాథియాన్‌ 11-9, 11-9, 11-8, 11-6 తేడాతో రష్యాకు చెందిన వ్లాదిమిర్‌ సిడోరెంకోను చిత్తుచేశాడు. మహిళల సింగిల్స్‌లో అహికా ముఖర్జీ 5-11, 4-11, 3-11, 4-11 తేడాతో జపాన్‌కు చెందిన హయాటా చేతిలో రౌండ్‌రౌండ్‌లో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో అమల్‌రాజ్‌-దేశారు జోడీ 11-8, 9-11, 9-11, 11-5, 8-11 తేడాతో తొలిరౌండ్‌లోనే ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్‌లో సుతీర్ధ ముఖర్జీామాధురిక జోడీ 3-11, 7-11, 4-11 తేడాతో కిన్‌-రుావాంగ్‌, రి క్వాన్‌ జి చేతిలో ఓడారు.