Dec 05,2021 20:49

ప్రజలకు అవగాహనక కల్పిస్తున్న ఎస్‌ఐ నాగార్జున

మూడనమ్మకాలను నమ్మరాదు : ఎస్‌ఐ
ప్రజాశక్తి - పగిడ్యాల

ప్రజలు మూడనమ్మకాలను నమ్మవద్దని ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సంకిరేణిపల్లె గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడారు. సంకిరేణిపల్లే గ్రామంలో హరికుమార్‌ అనే వ్యక్తి తనకు లకీëనరసింహస్వామి పైలోకి వస్తారని, పిల్లలు కాని మహిళలకు సంతానం అయ్యేలా మంత్రిస్తానని చెబుతున్నాడని, ఇలాంటి మాటలను నమ్మరాదన్నారు. మంత్రించి ఇచ్చిన నిమ్మకాయలను అహౌబిలం లకీëనరసింహ దేవాలయంలో ఇచ్చి ముడుపుకట్టడంవల్ల సంతానం కలుగుతారనే మూఢ నమ్మకాలను నమ్మవద్దన్నారు. ఒమిక్రాన్‌ కరోనా థర్డ్‌ వేవ్‌ అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారని, దూరప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో రావడం వల్ల కరోనా ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లోకి కొత్తవారిని రానివ్వకుండా ఉండాలనానరు. సంకిరేణిపల్లే గ్రామంలో ప్రజలకు మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఉన్నతాధికారులకు లేఖ పంపామని తెలిపారు.