Sep 15,2021 07:46

పిల్లలూ! చూడ్డానికి టెడ్డీబేర్‌ లాగా ఉన్న ఈ జంతువు పేరు 'రెడ్‌ పాండా'. మరి చూపులకి పిల్లలాగా కనిపిస్తున్న ఈ పాండా గురించి ఈ రోజు తెలుసుకుందామా ? 
    పెద్ద తల, గుండ్రటి చిన్ని చెవులు, బొద్దుగా ఉండే ఒళ్లు. ఎర్రగా, బుర్రగా కనిపించే ఇది మన దేశంలోని సిక్కిం రాష్ట్ర జంతువు. ప్రపంచంలో రెండే రెండు పాండా జాతులున్నాయి. వాటిలో చిన్నది ఇదే. రెండడుగుల ఎత్తుగా మనింట్లో తిరిగే పిల్లిలా ఉంటుంది. రోజులో 16 గంటలు తింటూనే ఉంటుంది. పగలంతా చెట్లపై కునుకుతీసి రాత్రంతా మేత మేస్తుంది. ఎక్కువగా వెదురు ఆకులే తింటుంది. రోజుకు రెండు లక్షల వెదురు ఆకుల్ని లాగించేస్తుంది. ప్రపంచంలో ఒకే రకం ఆహారంపై బతికేది ఇదొక్కటే. తోక దాదాపు రెండు అడుగులుంటుంది. దీని ముఖంలో నక్క పోలికలు ఉండటంతో ఫైర్‌ ఫాక్స్‌ అని కూడా పిలుస్తారు. ముదురు రంగులో ఉంటుందని బ్క్రెట్‌ పాండా, పిల్లిలా ఉంటుందని క్యాట్‌ బేర్‌, లెస్సెర్‌ పాండా పేర్లతో పిలుస్తారు. దీని చర్మం కోసం కొందరు వేటాడి చంపుతున్నారు! ప్రస్తుతం వీటి సంఖ్య 2,500 మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో, నేపాల్‌, చైనా, బర్మాలో ఉండే ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.