Oct 14,2021 14:48

తూర్పుగోదావరి : సముద్రంలో  మత్స్యకారుల వలకు అరుదుదైన చేప చిక్కింది. దాదాపు 20 కేజీల భారీ 'తెరచేప' అది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో వారి వలకు భారీ సైజులో ఉన్న ‘తెరపార’ చేప చిక్కింది. సముద్రం బయటకు తెచ్చి దాని బరువు తూయగా అది 20కేజీలు తూగింది. ఇది సొర చేప జాతికి చెందినదని, దీన్ని స్థానికంగా తెరపార లేదా సొఠారి అని పిలుస్తారు. ఈ చేపను వేలం నిర్వహించగా.. వేలలో ధర పలికింది. దాంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, భారీ సైజులో ఉన్న అరుదైన తెరపార చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. సముద్రంలో అప్పుడప్పుడు అరుదుదైన చేపలు మత్స్యకారుల వలలో పడుతుంటాయి. ఆ చేపలు చూడటం చాలా మందికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆ చేపలు పట్టిన మత్స్యకారులకు మంచిగా పైసలు కూడా వస్తాయి. అయితే ఇంత పెద్ద సైజులో ఎప్పుడూ ఇలాంటి చేపలు దొరకలేదని మత్స్యకారులు అంటున్నారు.