Nov 26,2020 16:32

హైదరాబాద్‌ : రాజమౌళి దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న' సినిమా సునీల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా సలోని నటించారు. వీరిద్దరి జంట ప్రేక్షకుల మదిలో బెస్ట్‌ పెయిర్‌గా నిలిచింది. కాగా, 'మర్యాదరామన్న' సినిమా విడుదలై పది సంవత్సరాలైంది. ఆ సినిమా తర్వాత ఈ జంట కూడా మళ్లీ కలిసి నటించలేదు. తాజా సమాచారం ప్రకారం... మరలా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారక ప్రకటన ఏమీ లేకుండానే షూటింగ్‌ చకచక జరిగిపోతోందట. ఈ సినిమాకు సునీల్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారని.. సునీల్‌కి, సలోనికి మళ్లీ హిట్‌ ఇవ్వనున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడదుల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేక థియేటర్లు ఓపెన్‌ అవుతున్న కారణంగా.. ఓటీటీ విడుదల నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందనీ వార్తలొస్తున్నాయి. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆదిత్య సునీల్‌, సలోనికి హిట్‌నందిస్తారో లేదో చూడాలి.