Nov 27,2020 13:29

శ్రీనగర్‌ : సరిహద్దుల్లో పాక్‌ భద్రతా దళాలు మరోసారి రెచ్చిపోయాయి. జమ్ముకాశ్మీర్‌లోని రాజోరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు విడిచారు. శుక్రవారం జరిగిన భీకర పోరులో నాయక్‌ ప్రేమ్‌ బహదూర్‌, రైఫిల్‌ మాన్‌ సుఖ్బీర్‌ సింగ్‌లు గాయపడగా..అనంతరం చికిత్స పొందుతూ మరణించారని ఆర్మీ తెలిపింది. మన భద్రతా దళాలు సైతం పాక్‌ కాల్పులను తిప్పి కొట్టాయని వెల్లడించింది.