Nov 29,2020 23:47

కరోనా వైరస్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి :జిల్లాలో ఆదివారం మరో 101 మందికి కరోనా నిర్థారణైంది. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 74,466కు చేరింది. తాజా బాధితుల్లో గుంటూరు నగరానికి చెందిన 34 మంది ఉన్నారు. మరోవైపు బాధితుల్లో మరొకరు మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 712కు పెరిగింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 160 మంది కోలుకోగా 1301 మంది చికిత్స పొందుతున్నారు.
మండలాల వారీగా జిల్లాలో ఆదివారం పాజిటివ్‌లు
గుంటూరు రూరల్‌ 1, అమరావతి 1, మంగళగిరి 3, పెదకాకాని 1, సత్తెనపల్లి 6, తాడేపల్లి 5, తాడికొండ 1, వట్టిచెరుకూరు 2, మాచర్ల 1, పిడుగురాళ్ల 2, నాదె ండ్ల 5, నర్సరావుపేట 9, వినుకొండ 5, అమృతలూరు 1, బాపట్ల 4, చేబ్రోలు 1, చెరుకుపల్లి 2, కర్లపాలెం 1, కొల్లిపర 1, నగరం 1, నిజాంపట్నం 4, పివి పాలెం 3, పొన్నూరు 4 రేపల్లె 2, తెనాలి 4, వేమూరు 1.
గుంటూరు నగరంలో పాజిటివ్‌లు (34)
శారదాకాలనీ 2, బ్రాడిపేట 2, బృందావన్‌గార్డెన్స్‌ 3, కొత్తపేట 2, సాగర్‌ కాల్వల క్వార్టర్స్‌ 2, శ్రీనివాసరావుపేట 2, యాదవ బజార్‌ 2, ఒక్క కేసు నమోదైన ప్రాంతాలు 17.